శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి కళ్యాణ మంటపంనకు భూమి పూజ

0
108

జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి కళ్యాణ మంటపం, ప్రహరీ గోడ వంటి పలు అభివృద్ధి పనులకు CJF నిధుల ద్వారా 39 లక్షల నిధుల పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి భూమి పూజ చేసారు. అనంతరం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ నాకు చిన్ననాటి నుండి ఈ ఆలయ ధర్మ కర్తలతో, గుడి తో అనుబంధం ఉందని గుడికి వెళ్లే రహదారి T.U.F.I.D.C నిధుల ద్వారా బిటి రోడ్డు ఆలయం దగ్గరకు వేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుందని, ఆలయ ఆవరణలో హరితహారంలో చెట్లు నాటాలని, ఆలయ ధర్మకర్తలు ప్రజల కొరకు పార్క్ ఏర్పాటు చేయాలని కోరగా దానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు బాలే లత శంకర్, పంబాల రాము, క్యాదాసు నవీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జి. ఆర్. దేశాయ్ , తెరాస యూత్ అధ్యక్షుడు కత్తురోజు గిరి, ఎల్లాల ఆనంద్ రావు, బండారు విజయ్, గంగారాం, కూతురు శేఖర్, గంగాధర్, ఆలయ ధర్మ కర్తలు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here