శానిటేషన్ స్ప్రే చేసిన ఎమ్మెల్యే

0
168

రాయికల్ తాజా కబురు : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శానిటేషన్ స్ప్రే చేసిన అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, కాలి స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న చెత్త,ముండ్ల చెట్లను తొలగించి భూ యజమానులకు నోటీస్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోని ఒడ్డెలింగపూర్,చింతలూర్,బోర్నపల్లి,మూటపల్లి,ఒడ్డెలింగపూర్, అలియనాయక్ తాండ,మాక్త్యా నాయక్ తాండ గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసి సభ్యురాలు జాదవ్ అశ్విని,మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,వైస్ చైర్మన్ రమాదేవి,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,కాంతారావు,మహేందర్,మహేష్,ఎంపీపీ సంధ్య సురేందర్ నాయక్, పి.ఎ.సి.సి చైర్మన్ మల్లారెడ్డి, తెరాస నాయకులు అచ్యుత్ రావు, అనిల్,రామ్మూర్తి, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here