వైయస్సార్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కో- కన్వీనర్ గా నేతి శ్రీకాంత్ నియామకం..

0
31

తాజాకబురు కోరుట్ల: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ఆదేశాల మేరకు హైదరాబాదు లో నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి అధికార కో కన్వీనర్ గా కోరుట్ల పట్టణానికి చెందిన నేతి శ్రీకాంత్ ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు,ఈ మేరకు నియమకా పత్రాన్ని అందజేశారని నేతి శ్రీకాంత్ తెలిపారు,ఈ సందర్బంగా హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైయస్స్ షర్మిల ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు..

ఈ సందర్బంగా నేతి శ్రీకాంత్ మాట్లాడుతూ..దివంగత నేత డా..వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుండి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అక్కడ చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికె ఆదర్శంగా నిలిచాయని, రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో వైయస్ షర్మిల నడుస్తు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తారని, వారి వెంట ఉండి పార్టీ బలోపేతానికి క్రుషి చేస్తానని అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here