వేలం వేయాల్సింది ప్రభుత్వ భూములను కాదు-మీ పదవులను: బీసీ సంక్షేమ సంఘం

0
35

తాజా కబురు కరీంనగర్: మంకమ్మ తోట లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాల యంలో బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలతో ముఖ్య సమావేశం జిల్లా బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగుల కనకయ్య గౌడ్ హాజరైనారు.అనం తరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అ ఖజానాను నింపుకోవడానికి,సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉంది కాబట్టి రా ష్ట్రంలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను అమ్మి ఖజానా నింపుకోవడానికి యో చిస్తోంది.అందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేయడం జరిగింది.ప్రభుత్వ భూములను వేలం పాట పాడి ప్రభుత్వ భూము లను అమ్మడాన్ని జిల్లా బీసీ సంక్షే మ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామని వారు తెలిపారు.ప్రభు త్వం వేలంపాట ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల లో 33 వేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించడం లేదని,ప్రభు త్వ భూములను అమ్ముతామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సం ఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వారు తెలిపారు.ప్రభుత్వ భూము లు ఉన్నది ప్రభుత్వ కార్యక్రమా లకు,సంక్షేమ కార్యక్రమాలకు, గురుకులాలు,ఆసుపత్రులు, కమ్యూనిటీ హాల్లు ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి అవ సరాలకు ప్రభుత్వ భూము లను ఉపయోగించాలి కానీ,ప్రభుత్వ భూమి వేలం పాట పాడి ప్రభుత్వ భూముల ద్వారా వచ్చిన డబ్బును కథనం నింపుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే అనేక మార్గాలు ఉన్నాయి.ముప్పై మూడు జిల్లాల లో ప్రభుత్వ భూ ముల్లో ప్రభుత్వ ఆస్పత్రులు గురు కులాలు కమ్యూనిటీ హాల్ లో నిర్మించినట్లు అయితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు తెలిపారు.గత ప్రభుత్వం లాగానే ప్రభుత్వ భూములను అమ్మడానికి ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ జూన్ 18వ తేదీన రాస్తా రోకోలు ధర్నాలు నిర్బంధాలకు పాల్పడి నటువంటి నాయకులు ఈరోజు ప్రభుత్వ భూములను అమ్మి వారి ఖజానాలు నింపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు తెలిపారు.వెంటనే ఈ ప్రభుత్వ భూములను అమ్మడాన్ని ఆపి జీవో ను వెంటనే రద్దు చేయాలని లేకుం టే పెద్ద ఎత్తున ఆందోళన చేపడ తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి స్తున్నా మని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగుల కనకయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ తో పాటు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు,బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నా రోజు రాకేష్ చారి,యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కాస రాజు,ఎస్కే జాంగిర్ పాషా మిల్కు రి సతీష్, సిరిపురం అరుణ్, తాడూరి కృష్ణ, గుమ్మడి శ్రీనివాస్, కొడిత్యాల సురేష్,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here