రాయికల్ తాజా కబురు:ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదినం సందర్భంగా ఇటిక్యాల నివేదిత వృద్ధాశ్రమంలో భాజపా నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీటీసీ సభ్యులు రాజనాల మధుకుమార్ మైతాపూర్ గ్రామంలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టంపేట భాజపా గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణు ఎంపీటీసీ సభ్యులు ఆకుల మహేష్,సింగల్ విండో చైర్మన్లు ముత్యం రెడ్డి,మహిపతి రెడ్డి,ఐటీసెల్ కన్వీనర్ రాజశేఖరరెడ్డి, ఎస్సి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయకులు తొగిటి లక్ష్మీనారాయణ, మంగాలరపు లక్ష్మీనారాయణ,యూత్ కార్యకర్తలు కండ్లపెళ్లి శ్రీహరి, పడిగెల కళ్యాణ్, మిట్టపెల్లి రాజు, ప్రదీప్,సాయిరాం,గోపి తదితరులు పాల్గొన్నారు.
Home రాజకీయ వార్తలు వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ, దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భాజపా నాయకులు