వినాయక విగ్రహాల తరలింపు అడ్డుకుంటున్నారని కోరుట్ల జాతీయ రహదారిపై ధర్నా

0
168

లక్షలు ఖర్చు పెట్టి వినాయక విగ్రహాలు తయారు చేసాము
నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారు కోరుట్ల విగ్రహ తయారీ యాజమాన్య దారులు
తాజా కబురు కోరుట్ల
:ప్రతి సంవత్సరం లాగానే వినాయక విగ్రహాల తయారీని కోరుట్ల కు సంబంధించిన కళాకారులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కి వినాయక విగ్రహాలు కోరుట్ల నుండి తరలిస్తారు. కోరుట్ల నుంచి పక్క రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వినాయక విగ్రహాలు తీసుకుపోయేందుకు ఇక్కడికి వస్తారు. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి వలన విగ్రహాలు తయారీ కొంతమేరకు తగ్గించినట్లు, తయారుచేసిన కొన్ని విగ్రహాలకు గత రెండు మూడు నెలల కింద ఆర్డర్లు వచ్చాయని ఉన్నట్లుండి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనల పేరుతో మూడు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేయరాదని గత రెండు మూడు రోజుల నుంచి ప్రచారం చేయడంతో ఆర్డర్లు ఇచ్చినటువంటి భక్తులు విగ్రహాలు తీసుకుపోయేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని గురువారం విగ్రహ తయారీ యాజమాన్యం, కార్మికులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు జరుపుకుంటామని భక్తులు తెలిపిన విగ్రహాలను ఆయా గ్రామాలకు తీసుకువెళ్ళేటప్పుడు పోలీసులు అడ్డుకుంటున్నారని కేవలం పండుగల సమయంలోనే విగ్రహాల తయారీ మరియు అమ్మకాల పైనే కార్మికుల కుటుంబాలు ఆధార పడ్డాయని వారు తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here