వినాయక మండపంలో కరోనా కష్టాలు..దర్శనానికి వచ్చినవారికి ధర్మల్ స్ర్కీనింగ్,శానీటైజేషన్..

0
188

తాజా కబురు కోరుట్ల : కరోనా అటు మనుషులను కాదు దేవుణ్ని కూడా భయపెడుతుంది, కాదుకాదు దేవుడిని దర్శించుకునెందుకు వెళ్లె భక్తులను భయపెడుతుంది, ప్రతి సంవత్సరం తొమ్మది రోజులు ఎంతో ఆనందంగా జరుపుకునె వినాయక నవరాత్రోత్సవాలు అటకెక్కాయి, కనీషం ఉన్న వినాయకుడి వద్దకు వెళ్లి చక్కగ దర్శనం చేసుకుందామంటె ఎక్కడ కరోనా తొంగి చూస్తుందోనని భయం, గా భయానికి మీనింగ్ తెలుపుతున్నారు గీ యువకులు….

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ప్రతి సంవత్సర నవరాత్రోత్సవాల్లో చిన్న,పెద్ద కలిపి ఓ నాలుబై వినాయకులను నిలబెట్టెవాళ్లు, కానీ కరోనా కాలంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తు రెండంటె రెండె పెట్టారు,నిత్యం తిరాం లేకుండా వినాయకుడికి టెంకాయలు, ప్రసాదాలు, 109 నైవేద్యాలు, ఇలా ఒక్కటేంటి ప్రతిరోజు పండగె ఉండేది, కానీ ఇప్పుడు బొజ్జగణపయ్యపై ప్రేమ ఉన్న ఆయన దగ్గరి రావాలంటె కరోనా భయం వెంటాడుతుంది,దాంతో భక్తులు వేల్లతో లెక్కపెట్టెంతమంది వస్తున్నారు, ఇలాగైతె కుదరదనుకున్న ఆ గ్రామ వివేకానంద యూత్ భక్తుల భయం పోగోట్టెందుకు వినూత్న రీతిలో దర్శణం చేపిస్తున్నారు, వచ్చె భక్తులకు ముందుగా ధర్మల్ స్కీనింగ్ చేస్తున్నారు.

ఆ తర్వాత చెతులకు శానీటైజర్ పోస్తున్నారు, దూరం నుండి దర్శనం చేసుకున్నాక వారికి తీర్థం కు బదులు అల్లం, సొంటి,పసుపు ఇలా తయారు చేసిన కషాయాన్ని తీర్థంగా అందిస్తున్నారు, అంతే కాదోండీ వినాయకుడికి కూడా నైవేధ్యంకు బదులు కషాయాన్నె చూపిస్తున్నారు, నిత్యం తయారు చెయ్యటం వచ్చె భక్తులకు అందించటం చేస్తున్నారు, ఎందకు అని అడిగితె ప్రజలకు అవగాహానతో పాటు వారికి రోగనిరోధక శక్తి పెంచటం కోసమని చెపుతున్నారు, ఇలా మొదలు పెట్టిన తర్వాత గ్రామంలోని భక్తులు ఒక్కరొక్కరు వినాయక మండపానికి రావటం ప్రారంభించారు, వినాయకుడికి కూడా మాస్క్ పెట్టడం, అలాగె  అతని చేతిలో శానిటైజర్ పెట్టడం చేస్తున్నారు…మొత్తానికైతె వినాయకుడి వద్దకు రావటానికి ఇలాంటి వినూత్న పద్దతిని ఎన్నకున్నారు యువకులు..ఈ కార్యక్రమంలో వివేకానంద కాలనికి చెందిన మర్రిపెళ్లి మనోజ్,ఒట్టే శివ,కల్లెడ జలందర్,అడేపు విజయ్,కట్టెకొల రాము,వాసం మహేష్,కొండవేని విజయ్ పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here