వినాయకుడి నిమజ్జనం లో లాఠీచార్జి వాస్తవం-భాదితులు

0
391

రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామంలో గత రెండు రోజుల క్రితం వినాయక నిమజ్జనం జరుగుతుండగా అకస్మాత్తుగా వచ్చిన పోలీసు వాహనాలలో నుంచి దిగిన రాయికల్ ఎస్సై, ఇతర సిబ్బంది బలవంతంగా వినాయక నిమజ్జన వాహనాలను తరలిస్తూ మాపై దాడి, లాఠీ చార్జి చేశారని మాపై జూలుం ప్రదర్శించడంతో దెబ్బలకు తాళలేక మేము పక్కకు జరిగామని లాఠీచార్జి బాధితులు గాంధర్ల సురేష్,మిట్టపల్లి మదన్, కాయితి ప్రమోద్, మెట్టపల్లి వివేక్ బుధవారం మీడియాతో అన్నారు.వాహనాలు తరలించి హిందూ పండగను వినాయక దైవాన్ని అమమనించరని పేర్కొన్నారు. చత్రపతి హిందూ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బోడుగం మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా వినాయక నిమజ్జనం చేస్తున్న యువకులపై కర్కశంగా లాఠీఛార్జి చేసి బలవంతంగా నిమజ్జన వాహనాలు తరలించి పోలీసులు ఎవరినీ కొట్టలేదని అవాస్తవ ప్రకటనలు ఇవ్వడం సరికాదని ఇట్టి విషయం పై జిల్లా కలెక్టర్ తాహాసిల్దార్ల కు ఫిర్యాదు చేసామని బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కల్లెడ ధర్మపురి, బొమ్మకంటి కిషన్,గాజంగీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here