విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?

0
127
nedarland journalist reserch at jagtilal tajakaburu

గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు

తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు సోమవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామాన్ని సందర్శించారు. నెదర్లాండ్స్ కు చెందిన జర్నలిస్ట్ ఈవా ఔడె ఎల్ఫెరింక్, బ్రిటిష్ ఫోటో జర్నలిస్ట్ రెబెక్కా కాన్వే లు హైదరాబాద్కు చెందిన అనువాదకురాలు ప్రియాంక బృందానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సంధానకర్తగా, గైడ్ గా వ్యవహరించారు.డచ్ జాతీయ దినపత్రిక ‘ఎన్నార్సీ హ్యాండిల్స్ బ్లాడ్’ కొరకు వారు ఈ సమాచారాన్ని సేకరించారు.
2019 సెప్టెంబర్ 29న ఖతార్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ముత్యంపేట గ్రామానికి చెందిన కార్పెంటర్ మండలోజి రాజేంద్ర ప్రభు (41) కుటుంబ సభ్యులను జర్నలిస్టుల బృందం పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.మృతునికి తల్లిదండ్రులు, భార్య సుచరిత, ఇద్దరు కూతుళ్లు నందిని (12), లాస్య (6) ఉన్నారు.
అనంతరం గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చిన ముత్యంపేట గ్రామానికి చెందిన వలస కార్మికులు ఏశాల సాగర్, మండ రాము, చింతపల్లి వెంకట రమణ, అంతుల గోవర్థన్ లవ కుమార్ లను జర్నలిస్టులు కలిసి వారి వలస అనుభవాలను తెలుసుకున్నారు. గల్ఫ్ లో మరణాలు, పాస్ పోర్టులు తీసుకొని యాజమానులు వేదింపులకు గురిచేయడం, వేతన దొంగతనము, విసా చార్జీల పేరిట అక్రమ వసూళ్లు, అరబిక్ భాషా సమస్య, తక్కువ వేతనం ఎక్కువ పని లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్ అల్లూరి మహేశ్ రెడ్డి, పంచాయతి సిబ్బంది శఠగోప శ్రీనివాస్, గ్రామ పెద్దలు నిమ్మల నాగయ్య, జిన్న గుండి రాము, వాకిటి ఆనంద్ రెడ్డి లు ఈ కార్యక్రమానికి సహకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here