వాడుకలోకి రాయికల్ న్యూ బస్ స్టాండ్

0
40


బస్ స్టాండ్ ఛాలెంజ్ తో సామజిక మాధ్యమాల్లో వీడియో లు అప్లోడ్ చేస్తున్నయువకులు

జగిత్యాల తాజా కబురు: రాయికల్ న్యూ బస్ స్టాండ్ కి ఆర్టీసీ బస్సుల ప్రారంభం…? అనే శీర్షికన శుక్రవారం తాజా కబురు లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది.కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదేశాలతో రాయికల్ న్యూ బస్ స్టాండ్ కి ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభమైనవి. నెటిజన్లు , సామజిక కార్యకర్తలు బస్ స్టాండ్ ఛాలెంజ్ పేరుతో పట్టణ బస్ స్టాండ్ కి నిత్యం బస్ ల రాకపోకలు జరగాలంటూ సామజిక మాధ్యమం లో వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు.రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగిరెడ్డి రఘుపతి శనివారం బస్ స్టాండ్ ఛాలెంజ్ కు సంబంధించి వీడియో ను సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేయగా నెటిజన్లు ఛాలెంజ్ స్వీకరించి మద్దతు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here