వలస కార్మికులను హోమ్ క్వారంటైన్లో ఉంచాలి-డి.ఎస్పీ వెంకటరమణ

0
143

జగిత్యాల తాజా కబురు : ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన వలస కార్మికుల వివరాలను పోలీసులకు తెలుపాలని , వెంటనే హోమ్ క్వారంటైన్లో ఉంచాలని జగిత్యాల డిఎస్పీ వెంకటరమణ సూచించారు. సోమవారం జగిత్యాల పట్టణం లోని దేవిశ్రీ గార్డెన్స్ లో డీఎస్పీ వెంకటరమణ కరోనా కట్టడి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈకార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణ, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణీ లు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాది నిర్ములన, వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారి వివరాలు పోలీస్ వారికి ఎప్పటికప్పుడు తెలపాలని,వారిని హోమ్ క్యారంటేన్ లో ఉంచాలని, ఎవరైనా కొత్త వారు వచ్చిన వారి వివరాలు పోలీసులకివ్వాలని సూచించారు. మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేి పలు విషయాల పై కార్యక్రమంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సి.ఐ జయేష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here