వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎం.పి.పి

0
186

రాయికల్: మండలంలోని భూపతిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని భూపతిపూర్, ఒడ్డె లింగాపూర్,బోర్నపల్లి ,ధర్మాజీ పేట్ గ్రామాల్లో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ లౌడియా సంధ్యారాణి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంఘ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రము నిర్వహిస్తామని,గ్రేడు1 వరి ధాన్యం క్వింటాలు కు 1835 రూపాయలు,సాధారణ గ్రేడు 1815 రూపాయల ధర ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో రైతు సామాజిక దూరం పాటిస్తూ హమాలీ కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్,సీఈఓ చంద్రశేకర్ ఆయా గ్రామాల సర్పంచులు జక్కుల చంద్రశేఖర్ ,పాలకుర్తి రవి , పాదం లత -రాజు, స్నేహలత హరీష్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు ఎంపిటిసిలు, పాల్తీయ స్వప్న, కవిత-శ్రీనివాస్, సింగిల్విండో వైస్ చైర్మన్ నాగుల మల్లయ్య, డైరెక్టర్లు నీతులు లక్ష్మీనారాయణ కొమ్ము గంగా రాజము, పాల్తీయ రమణ, శ్రీనివాస్,మల్యాల జలపతి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here