వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జువ్వడి కృష్ణారావు

0
207

కోరుట్ల తాజా కబురు: పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గుంలాపూర్ గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వడి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్లు, ప్రభుత్వం కలిసి “తరుగు” పేరు తో, రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కష్ట కాలం లో తక్షణమే” ధాన్యం కోత” ను ఆపేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల దోపిడీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమములో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ బోయినిపల్లి సత్యం రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ గడ్డం సత్తమ్మ గంగారాజం గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగని శంకర్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here