వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్

0
168

జగిత్యాల తాజా కబురు: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ జి.రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మల్యాల మండలం రామన్నపేట , ముత్యంపేట గ్
కొడిమ్యాల మండలం కొడిమ్యాల, నాచుపల్లి కథలాపూర్ మండలంలోని గంభీర్ పూర్, సిరికొండ గ్రామాలలో మరియు కోరుట్ల మండలంలోని మోహన్ రావు పేట గ్రామాలలోని వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రతి కేంద్రంలో  సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని రైతులు తప్పకుండా ధాన్యాన్ని శుభ్రపరిచి, ధాన్యాన్ని ఆర పెట్టాలని అన్నారు. ఆరబెట్టి, శుభ్రపరిచిన ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు సర్టిఫై చేస్తారని అన్నారు. నాణ్యత లోపించకుండా రైతులు వారికి కేటాయించిన నంబర్ల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి సహకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో వచ్చిన ధాన్యాన్ని ఎంత కొనుగోలు చేశారు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించారా అని అధికారులను అడిగారు. కేంద్రాలలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను తనిఖీ చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో ఆమాలీల సమస్యలు ఏమైనా ఉన్నచో వెంటనే పరిష్కరించాలని అన్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాలలో ఏ సమస్య ఉన్నాను త్వరితగతిన పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లర్లకు పంపాలని ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజేశం, డి సి ఓ రామానుజాచార్యులు, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, డి ఆర్ డి ఎ అడిషనల్ పిడి సతీష్ కుమార్, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here