లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు: రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి

0
86

తాజా కబురు జగిత్యాల: ఉదయం 6 నుండి 10 గంటల వరకు యధావిధిగా ప్రజ రవాణా, అన్ని దుకాణ సముదాయాలు తెరిచి ఉండును. ఉదయం 10 గంటల తరువాత రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాగ్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేయాలి.- – – ప్రభుత్వ ఆదేశాలను, లాక్ డౌన్ నియమాలను పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు.- – – లాక్ డౌన్ సమయం లో నిత్యవసర ,అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు సంబంధిత వాహనాలకు జిల్లా అదనపు ఎస్పీ కార్యాలయంలో పాసులు.- జిల్లా ఎస్పీలు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్.కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుండి పది రోజుల వరకు ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను కఠినంగా అమలు అయ్యే విధంగా చూడాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమిషనర్లను రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు.ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించకుండా లాక్ డౌన్ సమయం లో రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు.ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ఇష్టరీతిలో ఎవరైనా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్స్ 188,269,270,271,సెక్షన్ల ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005,ఎపిడేమిక్ ఆక్ట్ 1897 ప్రకారం, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు..

🔹 వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. 🔹 తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 🔹 వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. 🔹 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. 🔹 విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. 🔹 జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. 🔹 జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. 🔹 కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు🔹 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు🔹 ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.🔹 గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. 🔹 అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి🔹 అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.🔹 తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం🔹 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.🔹 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. 🔹 కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్, ఎస్పీ అడ్మిన్ కె. సురేష్ కుమార్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here