లయన్ గణపతుల పంపిణి

0
129

తాజా కబురు కోరుట్ల: లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆద్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం వహిస్తూ ” ప్రకృతిని ప్రేమిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” మట్టి వినాయకుని విగ్రహాలనే ప్రయిష్ఠించి పూజిద్దాం అనే నినాదంతో 500 మట్టి వినాయక విగ్రహాలను గృహపూజ నిమిత్తం లయన్స్ వాటర్ ప్లాంట్ వద్ద ఉచితంగా వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు లయన్ మంచాల జగన్ మాట్లాడుతూ ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కెమికల్స్ తో కూడిన రంగులు వినియోగించిన వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అదే మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ఏకవింశతి పూజ చేసి నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతితో మమేకం కావాలనే పండగ స్పూర్తి, పర్యావరణ హితం చేకూరుతుందని అన్నారు. అదేకోవలో గత పది సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆద్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షుడు లయన్ మంచాల జగన్, కార్యదర్శి లయన్ కొమ్ముల జీవన్ రెడ్డి, కోశాధికారి లయన్ గుంటుక మహేష్, లయన్ ఇల్లెందుల వెంకట్రాములు, లయన్ మండలోజి రవీందర్, లయన్ కె‌.జి.క్రిష్ణ, లయన్ కుందారపు మహేందర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here