లక్ష ఇచ్చుకో…ఇసుక తోడుకో…

0
308

తక్కల్లపెల్లి వాగు నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

జగిత్యాల తాజాకబురు క్రైమ్: కథలాపూర్ మండలంలోని తక్కల్లపెల్లి గ్రామ శివారు వాగు నుండి తోడుకున్నోళ్లకు తోడుకున్నంత…అన్నరీతిలో అక్రమార్కులు నిత్యం ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నారు. ఇసుకను గ్రామం నుండి నాగులపేట, దమ్మన్నపేట,మనేగూడెం పరిసర గ్రామాలతో పాటుగా కథలాపూర్, కోరుట్ల మండలాలకు తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు 4 నుండి 5 వేల రూపాయలకు అమ్ముతూ అందినంత దోచుకుంటున్నారు.గ్రామానికి చెందినవారు అయితే 1 లక్ష, ఇతర గ్రామాల వారైతే 2 లక్షల రూపాయలు అభివృద్ధి కమిటీకి ముట్టచెప్పి ఇష్టారీతిన ఇసుకను తోడుకోవచ్చనే నిబంధనలు పెట్టారనని,స్థానిక అధికారులకు ఈ వ్యవహారమంతా తెలిసినా పట్టించుకోకుండా ప్రత్యక్షంగా,పరోక్షంగా ఇసుక వ్యాపారులకు తోడ్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక డంపులు, అక్రమ రవాణా పై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా చేయు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here