రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..

0
94
tajakaburu
tajakaburu

కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..

రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు…

తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పోలిసు స్టేషన్ ఫరిదిలో కరోనా మొదటి దశలో లాక్ డౌన్ ను ఎంతొ సమర్తవంతంగా నిర్వర్తించిన కోరుట్ల సిఐ రాజశేఖర్ రాజు, ఇప్పుడు సెకండ్ వే లో కూడా నిర్విరామంగా తమ విధులను కొనసాగిస్తున్నారు..

 కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా యాక్సిడెంట్ ప్రదేశాలను బ్లాక్ స్పాట్ ను గుర్తించిన సి.ఐ రాజశేఖర్ రాజు, ఎస్ఐ సతీష్ ప్రమాదాల నివారణ గురించి మోహన్ రావు పేట వద్ద సైనింగ్ బోర్డ్స్ లు  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ  మాట్లాడుతూ…. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి సైనింగ్ బోర్డ్స్, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు స్పీడ్, రేడియం స్టిక్కర్స్, రోడ్డు పై పెయింటింగ్ వేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. మానవ తప్పిదం, అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. మరియు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి పోలీసుల సలహాలు సూచనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణ  కృషి చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్.ఐ సతీష్ గారు, పోలీసు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here