రైతు వేదిక నిర్మాణం కోసం కదిలిన జిల్లా యంత్రాంగం

0
301

తాజా కబురు జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో గత20 రోజుల క్రితం రైతు వేదిక నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆ స్థలం గ్రామంలోని కుల సంఘాలకు చెందిన ప్రైవేటు భూమి అని ప్రైవేట్ భూమి లో రైతు వేదిక నిర్మాణం ఏ విధంగా చేపడతారని 10 కులాలకు చెందిన సభ్యులు రైతు వేదిక పనులను అడ్డుకొని గ్రామపంచాయతీ పాలకవర్గం అనాలోచిత చర్య వల్ల రైతు వేదిక నిర్మాణానికి తలపెట్టిన పునాదులను కుల సంఘాలు కూల్చీవేయవలసి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.
దానితో 306 సర్వేనెంబర్ లో రైతు వేదిక నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసేందుకు గతంలో తాహసీల్దార్ మహేశ్వర్ సిబ్బందితో కలిసి వెళ్లగా అట్టి స్థలం తమకు చెందినదని కొంతభాగం ఇతరులు ఆక్రమించుకున్నారని దళితులు హద్దు రాళ్లను పీకి వేశారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఆర్డీవో మాధురి కుల సంఘాల సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి పునాదులను కూల్చిన స్థలంలోనే భవనం నిర్మాణం చేసేందుకు గ్రామ సర్పంచ్ కి, కుల సంఘాల సభ్యులకు తెలిపిన ఫలితం లేకపోయింది. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తుల సూచనలతో వేదిక భవనం నిర్మాణం కోసంమొదటి ప్రాధాన్యతగా గ్రామంలోని మంచి నీళ్ల బావి ముందుగల స్థలంలో రెండవ ప్రాధాన్యత గా మహిళా సంఘం భవనం పక్కన గల ఖాళీ స్థలంలో నిర్మించేందుకు తీర్మానం చేశారు. గురువారం తక్షణమే నర్సరీలో ఉన్న మొక్కల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని అక్కడ రైతు వేదిక భవన నిర్మాణం కు ఏర్పాట్లు చేయాలని జిల్లాలోని ఓ అధికారి నుంచి స్థానిక ప్రజాప్రతినిధికి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం.తర్వాత సాయంత్రం జాయింట్ కలెక్టర్ బి.రాజేశం, తాసిల్దార్ మహేశ్వర్ సర్పంచ్ మహ్మద్ అజారుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు రాజనాల మధు కుమార్ సర్వేనెంబర్ 306 లో మోఖపై రైతు వేదిక భవన నిర్మాణానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.
రాజకీయ కుట్రలతో అభివృద్ధి కుంటుపడుతుంది:
ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామంలోని కొందరి నాయకుల మధ్య మనస్పర్థల తో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని, రాజకీయ లబ్ధి కోసమే అనాలోచిత ఆలోచనల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here