రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

0
135

రాయికల్ తాజా కబురు: మండలంలోని ఇటిక్యాల,మహితాపూర్ క్లస్టర్ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని నిర్మాణం సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే సర్పంచులు, తహసీల్దార్ తమ దృష్టికి తీసుకురావాలని, ఈ నిర్మాణాలు రైతులు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఎం.పి.డి.ఓ రమేష్, పి.ఆర్.డి.ఇ శంకరయ్య, ఎ.ఇ ప్రసాద్,జడ్పీ.టీ.సీ సభ్యురాలు అశ్విని జాదవ్,ఎం.పి.పి సంధ్య రాణి,మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మల్లారెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు అజారుద్దీన్,సామల్ల లావణ్య, నాయకుల కోల శ్రీనివాస్,తలారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here