రైతువేధికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ జి. రవి

0
91

జగిత్యాల తాజా కబురు: జిల్లాలోని 71 క్లస్టర్లలో చేపడుతున్న రైతువేధిక నిర్మాణాలను ఎవిధంగా చేస్తే త్వరగా పనులు పూర్తిచేయగలుగుతారో ప్రణాళికను తయారు చేసుకొని, నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కోరుట్ల నియోజక వర్గంలో 5, ధర్మపురి నియోజక వర్గంలో 3, చోప్పదండి నియోజక వర్గంలో 3 మొత్తం 11 రైతువేధిక నిర్మాణాలను పూర్తిచేయడం జరిగిందని అన్నారు.ధర్మపురి నియోజక వర్గంలో 10, చోప్పదండి నియోజక వర్గంలో 5, జగిత్యాల 6 పైకప్పు వరకు పూర్తిచేయడం జరిగిందని వాటిని 2రోజులలో పూర్తిచేయాలని అన్నారు. లేబర్ ను పెంచుతున్నప్పటికి ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని, పండుగ వాతవరణంలో పనులు పూర్తి చేయాడానికి అందరు కృషిచేయాలని అన్నారు. రైతువేదికలకు ఫాబ్రికేషన్ మెటిరియల్, ఇసుక మరియు సిమెంట్ సరిపోయోంత ఉందా, లేనట్లయితే ఎప్పుడు వస్తుందో పర్యవేక్షించాలని అన్నారు. పనుల వారిగా ఎప్పటికప్పుడు బిల్లులను అప్ లోడ్ చేయాలని, మండల అధికారులు, ఎస్.హెచ్.ఓ లు సీజ్ చేసిన ఇసుకను అవసరం మేరకు రైతువేదికలకు తరలించాలని అన్నారు. వర్షాలు లేని సమయంలో పనులు జరిగేలా చూడాలని అన్నారు. మరింత శ్రద్దతో నిర్దేశించి సమయంలో రైతువేధికల నిర్మాణాలు పూర్తిచేయాలని, లేనట్లయితె పూర్తిగా విఫలం అవుతారని అన్నారు. సమస్యలు ఉన్నట్లయితే అధికారులు దృష్టికి తీసుకురావాలని, ఇసుక, సిమెంట్ సమస్యలు ఎదురయినట్లయితే స్థానికంగా సర్దుబాటు చేసుకోని, మీకు వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేసే విధంగా చూడాలని అన్నారు. ఎటువంటి కారణాల వలన రైతువెదికల నిర్మాణాలు ఆలస్యం కాకుండ ఈనెల18 లోగా పూర్తి కావలని అన్నారు. ఏ పనులు ఏ విధంగా చేస్తే పూర్తవుతుందో ప్రణాళిక తయారు చేసుకొని ఆ విధంగా లేబర్, మెటిరియల్ సమకూర్చుకుంటు పనులు పూర్తచేయాలని అన్నారు. పనులు పురోగతి నివేదికను రోజువారిగా పంపించాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here