రైతుల కడుపు మండితే రాజ్యాలు కూలిపోతాయి

0
114

మొక్కలు నాటితే… ధాన్యం ఎక్కడ పోయాలి

తాజా కబురు రాయికల్ టౌన్: ఆరు గాలల పాటు కష్టపడి పండించిన పంటను ఆరబెట్టి విక్రయించేందుకు ఏర్పాటుచేసిన మార్కెట్ యార్డ్ స్థలంలో హరితహారం పేరుతో మొక్కలు నాటితే ధాన్యం ఎక్కడ పోయాలంటూ శుక్రవారం రైతులు నిరసన తెలిపారు. రైతులకు కేటాయించినా మార్కెట్ యార్డ్ లో మొక్కలు నాట వద్దని రాయికల్ పట్టణ , మండలానికి చెందిన రైతులు మార్కెట్ యార్డు వద్ద గల రాయికల్ ,ఇటిక్యాల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపి అనంతరం మార్కెట్ యాడ్ లో మొక్కలు నాటడానికి తవ్విన గుంతలలో కూర్చుని తవ్విన గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే ,అధికారులు మార్కెట్ యార్డ్ లో మొక్కలు నాటం అని హామీ ఇచ్చినప్పటికీ అధికారుల అత్యాశతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టే స్థలాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు.రైతుల ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ స్థలంలో మొక్కల పెంపకానికి వినియోగించరాదని పలు పార్టీలకు చెందిన రైతు నాయకులు డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డు స్థలం 5ఎకరాల 9గుంటలు ఉండగా షెడ్డు నిర్మాణం ,కార్యాలయం ,ఫ్లాట్ ఫామ్లకు,పార్కింగ్ స్థలం ,ధర్మకాంట ,మంచినీటి సౌకర్యం ,ధాన్యం తూకం ,వాహనాల రాకపోకలు ,ధాన్యం నిల్వ వంటి వాటికి సుమారు 2 ఎకరాల స్థలం పోగా మిగిలిన 3 ఎకరాల స్థలంలో రైతుల ధాన్యం కుప్పలు, ఆరబెట్టేందుకు స్థలం అవసరమని పేర్కొన్నారు . మార్కెట్ యార్డ్ స్థలాన్ని రైతులకు వినియోగించకుండా యాదాద్రి ప్లాంటేషన్ మొక్కల పెంపకం వినియోగించడం దారుణమని ఇప్పటికే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని మార్కెట్ యార్డ్ లో నెలకొన్న రైతుల సమస్యలు తీర్చకపోగా యార్డు స్థలాన్ని మొక్కలతో నింపితే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడితే ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. రైతులంతా సమిష్టిగా కలిసి మార్కెట్ యార్డు ఏర్పాటైతే సమస్యలు తొలుగుతాయని ఆశపడ్డ రైతుల ఆశలను అధికారుల అవగాహన లోపంతో యార్డు స్థలాన్ని రైతులకు వినియోగించకుండా మొక్కలు నాటేందుకు పూనుకోవడం సమంజసం కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో, రోడ్లపై ధాన్యాన్ని పోస్తే ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. మార్కెట్ యార్డ్ స్థలంలో మియావాకి యాదాద్రి మొక్కల పెంపకాన్ని అధికారులు ఉపసంహరించుకోవాలని అన్నారు . రైతులకు ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం నిల్వ స్థలాన్ని మార్కెట్ కు చెందిన స్థలాన్ని మొక్కల పెంపకం కు వినియోగిస్తే రైతులు దాన్యం ఎక్కడ పోసుకోవాలని వారు అధికారులను ప్రశ్నించారు. మార్కెట్ యార్డ్ స్థలంలో మొక్కలు నాటేందుకు గుంతలు పూడ్చాలని గుంత లో కూర్చుని నిరసన తెలిపారు. రైతుల నిరసన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మహేశ్వర్, ఎస్సై ఆరోగ్యం సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్, భాజపా నాయకులు గుర్రం మహేందర్ గౌడ్, కోయ్యడి మహిపాల్, ఎద్దండి దివాకర్, కుర్మ మల్లారెడ్డి,ఏనుగు ముత్యం రెడ్డి,వేణు,మ్యాకల రమేష్ , చింతల పెళ్లి గంగారెడ్డి, కటిపెల్లీ గంగారెడ్డి, పడిగెల రవి,సతీష్,సంజీవ్,దులురి భీమయ్య, నరేందర,నరేష్ ,శ్రీకాంత్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here