రైతన్నలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది-భా.జ.పా నియోజకవర్గ ఇంచార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి

0
218

రాయికల్ రూరల్ తాజా కబురు: మండలంలోని రాజనగర్, ఆలూరు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం భా.జ.పా నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలను చిన్నచూపు చూస్తుందని, ఓవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ సమస్యలతో ప్రజలు సతమతమౌతుంటే మరోవైపు రైతులు ఆరుగాలాల పాటు కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై తప్ప,తాలు అంటూ 40 కిలోల నుండి 2 కిలోల వరకు ధాన్యం తరుగు తీసి వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ, కొన్ని మిల్లర్లలో ధాన్యం బస్తాలను దింపుకోవాలంటే తరుగు తీసి వేస్తే తప్పా ధాన్యాన్ని దింపు కోమని రైతులను బెదిరించిన సందర్భాలున్నాయని, రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్ల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయనతో పాటుగా ఎంపీ.టీ.సీ సభ్యులు రాజనాల మధు కుమార్, ఆకుల మహేష్, భా.జ.పా మండల ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణు, కార్యకర్తలు అంజన్న ,భీమన్న, మెక్కొండ రామిరెడ్డి, శేఖర్, రాజు, రైతులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here