రాష్ట్ర ప్రభుత్వానికి మతస్వాతంత్రపు హక్కుని నిరోధించే హక్కు లేదు – బిజెపి జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్ రెడ్డి

0
136

తాజా కబురు జగిత్యాల:రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గణేశ్ ఉత్సవాలపై చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రాథమిక హక్కులను కేవలం అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 356,352,360 ద్వారా అత్యుత్తమైన ప్రధాన పౌరులు అయిన రాష్ట్రపతి,గవర్నర్ గార్లకు ఈ ఆర్టికల్స్ ఉపయోగించినప్పుడు మాత్రమే ఆంక్షలు విధించవచ్చని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా గణేష్ ఉత్సవాలను నిషేధించడం మతస్వాతంత్రపు హక్కు లను పూర్తిగా హరించడమే అని జగిత్యాల జిల్లా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్-19 గైడెన్స్ మరియు బౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాల్ని జరుపుకోవటానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతేకాకుండా ప్రజలంతా కూడా కొవిడ్-19 గైడెన్స్ అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ వినాయక విగ్రహాలు ప్రతిష్టించి అదేవిధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని అలాగే స్వచ్ఛందంగా సామూహిక నిమజ్జనంకు దూరంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు.ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తీసుకున్న నిర్ణయాలను చూస్తే ఈ ప్రభుత్వం హిందువుల పట్ల ఎంత వివక్ష చూపిస్తుందో అర్థమవుతుందని ఈ చర్య పూర్తిగా మతస్వాతంత్రపు హక్కును హరించడం ప్రాథమిక హక్కుల లో భాగమైన ఆర్టికల్ 25 ను బంగపరచడమే కావున ప్రభుత్వం ఆంక్షలు రాజ్యాంగం లో నిర్దేశించిన హక్కులకు లోబడి మాత్రమే ఉండాలని కానీ ప్రభుత్వం గణేష్ ఉత్సవ మండపాలను అడ్డుకోవడం చూస్తే హిందువులకు నిర్దేశించిన మతస్వాతంత్రపు హక్కులు అయిన ఆర్టికల్ 25 ఉల్లంఘించడమే కాబట్టి కొవిడ్-19 నిబంధనలను అనుసరించి గణేష్ ఉత్సవ మండపాలను నిర్వహించుకునేల నిర్ణయాలు తీసుకోవాలి అని కోడిపల్లి గోపాల్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొవిడ్-19 గైడెన్స్ మరియు భౌతిక దూరం అనుసరిస్తూ ఉత్సవాలు జరుపుకునే ఉత్తర్వులు ఇవ్వాలని హిందువులకు మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఎలా పరిరక్షించుకోవాలో బాగా తెలుసునని ఆంక్షలు విధిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here