రాయికల్: అత్యవసర పరిస్థితిలో, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆపదలో సరియగు సమయంలో ఆసుపత్రికి తరలించేందుకు అందరికీ గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.కానీ ఆదివారం మండలంలోని ఒడ్డాలింగపూర్ గ్రామం వద్ద ఓ యువకుడు ద్విచక్ర వాహనం పై నుండి పడిపోయాడని పలుమార్లు 108 నెంబర్ కు సమాచారం ఇచ్చినప్పటికీ అంబులెన్స్ రాకపోవడంతో గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో వెంటనే స్పందించిన రాయికల్ ఎస్సై ఆరోగ్యం స్వయంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆ యువకుడిని పోలీసు వాహనంలో తరలించారు. రాయికల్ మండల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని 108 అంబులెన్సు సేవలు అందించడంలో విఫలమైందా…? అసలు రాయికల్ మండల కేంద్రానికి కేటాయించిన 108 అంబులెన్సు జిల్లా పరిధిలోనే ఉందా….? అనే సందేహాలు మండల ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నందున ప్రజా ప్రతినిధులు,అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకుని మండలానికి కేటాయించిన అంబులెన్సు మండల పరిధిలోనే నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.