రాయికల్ లో భా.జ.పా నిరసన

0
181

రాయికల్ తాజా కబురు: భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు భాజపా నాయకులు ప్లా కార్డులతో నిరసన చేపట్టారు. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించి, ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రం లో అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా భాజపా జిల్లా అధికార ప్రతినిధి చిలుకమర్రి మదన్ మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతోనే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని, రాష్ట్రం లో కరోనా పరీక్షలు నిర్వహించే కిట్లు లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదుష్టమని అనేక మంది రాష్ట్ర ఖజానాకు అందజేసిన విరాళాలు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఆయస్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయినదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోడుగం మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అన్నవేనీ వేణు, ఎంపిటిసి సభ్యులు మధుకుమార్, మహేష్, నాయకులు నారాయణ రెడ్డి, ధర్మపురి, శ్రీకాంత్, శంకర్, అశోక్, మల్లేష్, శ్రీను, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here