రాయికల్ లో పందుల కోసం ధర్నా ఎందుకు చేశారు…?

0
176

రాయికల్ తాజా కబురు టౌన్:రాయికల్ పట్టణానికి చెందిన దొమ్మరి కులస్తులు గాంధీ చౌక్ వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రహదారి పై సోమవారం ధర్నా చేశారు. తమకు ఉపాధి, జీవనాధారంగా ఉన్న పందులను, పురపాలక సంఘం సిబ్బంది ఎలాంటి నోటీసు ఇవ్వవుండా పట్టుకొని తరలించడంతో వారు పురపాలక చైర్మన్ మోర హన్మాండ్లును కలిసి పందులను పట్టుకోవద్దని తెలుపగా మీరు నాకు ఓటు వేయలేదని, ఏమైనా ఉంటే మీ కౌన్సిలర్ గండ్ర రమాదేవి తో మాట్లాడమని చెప్పడంతో ఆగ్రహించిన వారు గాంధీ చౌక్ వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ఘటనా స్థలానికి వచ్చి ధర్నా విరమించాలని కోరగా ముందస్తుగా ఎందుకు నోటీసు ఇవ్వలేదని వారు తిరిగి ప్రశ్నించడంతో కమిషనర్ తమ బాధ్యతను నిర్వహించామని నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి ఏ పనైనా చేసే హక్కు ఉందని అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ ఐ ఆరోగ్యం వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి వారిని సముదాయించి మీకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.ఈ విషయంపై పాత్రికేయులు మున్సిపల్ చైర్మన్ ను వివరణ కోరగా నేను అల అన్లేదని దొమ్మరి కులస్తులు ఉదయం ఆ విషయంపై కలవగా వైస్ చైర్మన్ రమదేవి దృష్టికి కూడా తిసుకపొమ్మని తెలిపాను కానీ మాకువొట్లు వేయలేదని అనలేదని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here