రాయికల్ లో ధర్నా చేస్తాం…మైతాపూర్ గ్రామస్తులు.

0
349

తాజా కబురు రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామ 1వ వార్డులో మురికి కాలువల నిర్మాణం పనులను అడ్డుకుంటే మండల కేంద్రం లోని శివాజీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని శనివారం వార్డుకు చెందినవారు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద పంచాయితీ కార్యదర్శి,ఉపసర్పంచ్ లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సంధర్బంగా 1వ వార్డు సభ్యురాలు ఎనుగందుల మహేశ్వరీ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల వల్ల గతంలో మురికి కాలువలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, వర్షాలకు నీరంతా ఇళ్లలోకి వస్తుందని పలు మార్లు పాలక వర్గ ప్రజాప్రతినిధులకు తెలిపిన పట్టించుకోకపోవడంతో వార్డు ప్రజల సహకారంతో స్వయంగా తామే మురికి కాలువలు నిర్మాణం చేసుకుంటామని పనులు మొదలు పెడితే నిర్మాణానికి అనుమతులు లేవని, పై అధికారులు, ప్రజా ప్రతినిధులు పనులను ఆపాలని సూచిస్తున్నారని పంచాయితీ కార్యదర్శి తెలుపడంతో వార్డు ప్రజలందరూ గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు చేరుకొని పనులను అడ్డుకుంటే మండల కేంద్రంలో ధర్నా చేస్తామని హెచ్చరించి, పంచాయితీ కార్యదర్శి వేణు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ లకు వినతి పత్రం అందించారు. ఈ విషయం పై మా ప్రతినిధి పంచాయితీ కార్యదర్శిని వివరణ కోరగా దరఖాస్తును పరిశీలించి గ్రామ పంచాయితీ ద్వారానే నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here