రాయికల్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

0
84

రాయికల్ తాజా కబురు: రిపోర్టర్ (ఫ్రీ లాన్సర్) సుధాకర్ గౌడ్

అల్లీపూర్ గ్రామంలో…
గ్రామంలో ఎమ్మెల్యే డా సంజకుమార్,రాష్ట్ర తెరాస పార్టీ ప్రధానకార్యదర్శి బస్వరాజు సారయ్య చేతుల మీదుగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరచారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాతే సిఎం కె.సి.ఆర్ మన ప్రాంతానికి చెందిన ఉద్యమ కారుల గొప్పతనాన్ని బహిర్గతం చేసి నాయకుల ఉద్యమ స్ఫూర్తిని చాటారని, తెలంగాణ ఉద్యమ నాయకుల గొప్పతనాన్ని, చాకలి ఐలమ్మను స్మరించు కోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జాదవ్ అశ్విని,ఎంపిపి సంధ్యారాణి, సర్పచ్ గంగారెడ్డి తెరాస నాయకులు పాల్గొన్నారు.

రాయికల్ లో… పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగాసాయుధ యోధురాలు చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పట్టణ రజక సంఘం అధ్యక్షులు జoబుక నగేష్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, 4వ వార్డు కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి,రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…
శివాజీ చౌరస్తాలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వాతంత్రోద్యమంలో మరియు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ స్వాతంత్రోద్యమ సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముంజ ధర్మపురి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కుంభోజి రవి, జిల్లా ప్రచార కార్యదర్శి అనుపురం లింబాద్రి గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి చిలివేరి నాగరాజు, మండల అధ్యక్షులు గోసికొండ నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి నాగరాజు, నాయకులు కనికరపు లక్ష్మణ్, కడార్ల శ్రీనివాస్ తో పాటు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వడ్డేలింగపూర్ కమ్యూనిటీ హాల్లో ….
తెలంగాణ అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ అంబేడ్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ స్వాతంత్రోద్యమ సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో మోర్తాడ్ సాయి సురేష్ బట్టు రంజిత్ గడ్డం నవీన్ మారంపల్లి శేఖర్ పంగ నవీన్ వడ్లూరి రఘు ఈదుల యశ్వంత్ రావు పాల్గొన్నారు

ఇటిక్యాల లో…
రజక యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో
సర్పంచ్ సామల్ల లావణ్యవేణు,ఉపసర్పంచ్ శేఖర్, ఎంపీటీసీ రాధఆదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహిపతి రెడ్డి, ఎఎమ్ సి వైస్ చెర్మైన్ వేణు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here