రాయికల్ లో గురువారం ఆలస్యంగా ప్రారంభమైన వాక్సిన్…?

0
189

రాయికల్ లో హెచ్.ఈ.ఓ వస్తేనే వాక్సిన్….?


తాజా కబురు డెస్క్: జగిత్యాల జిల్లా రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందని, గురువారం హెచ్.ఈ. ఓ వస్తే గాని వాక్సిన్ ప్రారంభం చేయమని ఆసుపత్రి సిబ్బంది తెలుపడంతో చేసేది ఏమి లేక ఆ సారు వచ్చేదాకా గేట్ బయటే నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, వాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు వాపోతున్నారు.ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన వాక్సిన్ 10 గంటల సమయం గడిచిన ప్రారంభించకపోవడంతో వాక్సిన్ కోసం వచ్చిన పలువురు వెనుదిరిగి వెళ్ళారు .ఆసుపత్రికి ఆలస్యంగా వచ్చిన హెచ్.ఈ.ఓ శ్రీనివాస్ పరిచయం ఉన్న వారిని క్యూ లైన్ లో కాకుండా ప్రధాన ద్వారం గుండా లోనికి పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.అంతే కాకుండా నిత్యం ఆయా గ్రామాల్లోని ఆరోగ్య సమీక్షా, ఏ.ఎన్.ఎం ల పనితీరుపై పర్యావేక్షించాల్సిన అధికారి ఆసుపత్రి కుర్చికే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి,ఉన్నతాధికారులు స్పందించి వాక్సిన్ కోసం వచ్చిన వారికీ సరియగు సమయానికి వాక్సిన్ ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, భౌతిక దూరం పాటించే విదంగా తగు ఏర్పాట్లు చేయాలనీ వాక్సిన్ కోసం వచ్చినవారు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here