రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

0
41

జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అన్న వేణు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత హక్కుల ప్రదాత అందరికీ సమానత్వ హక్కు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని,ప్రపంచంలోనే మేధావిగా గుర్తించిన ప్రధాని మోడీ దళితులకు పట్టం కట్టారని, దేశాధ్యక్షుడిగా దళిత ప్రతిభావంతుడు రాం నాథ్ కోవిద్ కు అవకాశం ఇచ్చిన మోడీ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు బన్న సంజీవ్, మండల అధ్యక్షులు చెలిమేల మల్లేశం, నాయకులు సామల్ల సతీష్, చిలివెరి ప్రవీణ్,ముత్యం రెడ్డి, భుమేష్,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here