రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ బృందం

0
116

తాజా కబురు రాయికల్: కోవిడ్ -19 వ్యాధి పై అందిస్తున్న సేవలపై, కోవిడేతర సేవలపై వైద్యాధికారి డా.కృష్ణచైతన్య నుండి శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ బృందం వివరాలు అడిగి తెలుసుకున్నారు.మండలంలోని ప్రజలకు కోవిడ్ -19 వ్యాధి గురించి అందిస్తున్న సేవలను, మాతాశిశు సంరక్షణ సేవలు, క్షయ,అసంక్రామిక వ్యాధుల గురించి పర్యవేక్షకుల,ఏ.ఎన్.ఎం, వైద్య ఆరోగ్య సిబ్బంది నుండి పలు వివరాలు సేకరించారు. సిబ్బంది వివరణ పై రాష్ట్ర ఆరోగ్యశాఖ బృందం సభ్యులు టి.స్వామి,ఉమ సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డి.పి.ఎం రాజేంధర్, ప్రా.ఆ.కేంద్రం వైద్యాధికారులు డా.కృష్ణచైతన్య,డా.నరేశ్, హెచ్.ఈ.ఒశ్రీనివాస్,పి.హెచ్.ఎన్ సుగుణాదేవి,హెచ్.ఎస్ శ్రీధర్ లాబ్ టెక్నీషియన్ లు సంతోష్ , రంజిత్, ఫార్మసిస్ట్ జంషెద్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here