రామాజీపేట్ రామాలయం లో ఘనంగా చిన్నజీయర్ స్వామీజీ తిరునక్షత్ర (జన్మదిన) వేడుకలు… 

0
42

తాజా కబురు రాయికల్: వి. స్వామి యాదవ్ (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)

నడిచే నారాయణ రూపమే చిన్నజీయర్ స్వామి జీ -ఆలయ చైర్మన్ ఎనుగంటి రాములు

పరమహంసరివ్రాజకులు పరమాచార్యులు జగదాచార్యులు స్వాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ (జన్మదిన) తిరునక్షత్రం సందర్భంగా నేడు రామాజీపేట్ శ్రీరామాలయం లో స్వామివారి జన్మదిన వేడుకలను వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీసీతారామచంద్ర స్వామి వారికి పంచామృతాభిషేకం, పుష్పార్చన, అర్చన లు చేసి సర్వాంగసుందరంగా అలంకరించి, నారికేళం, మహా నైవేద్యం, పండ్లను నివేదించి మంగళహారతులు సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి మంగళాశాసనములు పొందారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి జీ నడిచే నారాయణులని, అపర రామానుజులని, శ్రీరాముని తేజంతో అవతరించిన సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువని మోక్ష ప్రదాత అని అన్నారు. ‌వికాస తరంగిణీ జిల్లా బాధ్యులు ఎద్దండి రాజు స్వామివారి సేవాకార్యక్రమాలను, విశిష్టాద్వైత ఔన్నత్యాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జకిలేటి హరీష్ రావ్, యం.పి.టి.సి. ఆకుల మహేష్, బోడ్గం భీమరెడ్డి, కోల శంకర్, శ్రీనివాస్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కోల రాజు, ఇద్ధం సుధీర్ రెడ్డి, విజయ్, జుంబర్తి నరేంధర్, పూజారి శ్రీనివాస్, వికాస తరంగిణి బాధ్యులు, స్వామివారి పాద దాసులు, వేల్పుల స్వామి, ఎద్దండి ముత్యంపు రాజు, గన్నవరం గంగాధర్, వట్టిమల్ల శ్రీనివాస్, బోడ్గం శైలేందర్, రాజు, గంగాధర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here