రాచరికపాలనలోను ఇంత నియంతృత్వం లేదు

0
105

కాంట్రాక్టు వ్యవస్థనే లేకుండా చేస్తున్న ఘనత కేసిఆర్ దే

ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ద్వజం

తాజా కబురు జగిత్యాల:రాష్ట్ర ప్రభుత్వాన్ని విభేదించే ఆలోచన ఎవరు చేసినా వారిపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని, రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతుందని, రాచరికపు పాలనలో సైతం ఇంతనియంతృత్వంగా వ్యవహరించి ఉండరని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తానని చెబితే ఉద్యోగాలన్ని క్రమభద్దీకరిస్తారని అనుకుంటే నేడు కేసిఆర్ కాంట్రాక్టు,అవుట్సోర్సింగ్ వ్యవస్థనే లేకుండా చేస్తున్నారని ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు.ఉద్యానవనశాఖలో మండలం పరిధిలో పనిచేస్తున్న 500మంది విస్తీరణాధికారులను తొలగించడంతో పండ్లు, కూరగాయల తోటల సాగుకు సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడంతో పంటలు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసిఆర్ మానసపుత్రిక గా చెప్పుకునే మిషన్ భగీరథలో వివిధ కేటగిరీలో పోటీచేసే 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని , మిషన్ భగీరథ ట్యాంకులెక్కి నిరసన తెలిపిన పట్టించుకోకుండా ఏకపక్షంగా వారిని తొలగించడం అన్యాయమన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సోనియాగాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు లబించేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని దాంతో పల్లెల్లో ఉపాధిమెరుగుపడిందన్నారు. జాబ్ కార్డు ఉన్న్న యువకులు,నిరుద్యోగులు,మహిళలు ఉపాధి పనులకు వెళ్తూ అందరు ఉపాధి పొందుతున్నారని, పల్లెల్లో పండుగ వాతావరణంలో పనులు నడుస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు.అయితే ఉపాధి పనులను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం నాలుగు నెలలుగా పక్కకు పెట్టడం దుర్మార్గపు చర్య అని విమర్శిస్తు,ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
2019లో రాష్ట్ర ప్రభుత్వం ఓజీవో తీసుకురావడంతో ఉద్యోగ భద్రత కావాలని, పనిదినాలతో ముడిపెట్టకుండా తమ ఉద్యోగాలను రెన్యూవల్ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు విధులకు హాజరవుతూ నే మార్చి నెలలో వారంరోజులు నిరసన చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోవారంరోజుల అనంతరం విధులకు హాజరుకావడానికి వేళ్తే హాజరుకానివ్వకుండా వారిని ఉద్యోగాలను తొలగించడం కేసిఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు.ఉద్యోగులు హక్కుల సాధనకోసం నిరసన తెలిపితే వారి ఉద్యోగాలే ఊడగొట్టిన ఉద్యమనేత కేసిఆర్ అని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ చేసే 10వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాలనుంచి తొలగించడం అవివేకమన్నారు.
ధనిక రాష్ట్ర మని చెప్పుకుంటున్న కేసిఆర్ ఒక్కొక్కరిగా ఉద్యోగాలను తొలగిస్తున్నారని, పక్క రాష్ట్రం అప్పుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరింఛే ప్రక్రియ చేపట్టిందన జీవన్ రెడ్డిి గుర్తు చేశారు.
ఉపాధి హామీ పథకానికి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 70వేల కోట్లు కెటాయించడమే గాకుండా కరోనా ప్రత్యేక ప్యాకేజీ కింద మరో 30వేల కోట్లు కేటాయించిందనీ ఆపనులను పర్యవేక్షిస్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం,అపనుల బాధ్యత పంచాయతీ కార్యదర్శుల కు అప్పజెప్పారని తెలిపారు.
వివిధ శాఖల్లో తొలగించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, బీర్ పూర్ ఎంపిపి మసర్తి రమేష్, గాజుల రాజేందర్, కోర్టు శ్రీనివాస్, చందా రాధాకిషన్, పులి రాము, శరత్ రెడ్డి తదితరులు ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here