రాయికల్ రూరల్ తాజా కబురు: మండలంలోని ఇటిక్యాల నివేదిత వృద్ధాశ్రమంలో రామాజిపేట గ్రామస్తుడైన బెక్కం సుధాకర్ యువకుని పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం మైతాపూర్ చర్ల కొండపూర్ ఎం.పి.టి.సి సభ్యులురాజనాల మధు కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో యువత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఇటిక్యాల గ్రామ ఎం.పి.టి.సి సభ్యులు ఆదిరెడ్డి, నాయకులు ఏలేటి జలంధర్, కంటే అరవింద్, భూషనవేని శశిధర్ , కండ్లపెల్లి నితిన్ తదితరులు పాల్గొన్నారు