యునిసెఫ్,స్వచ్ఛ్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ

0
184

రాయికల్ టౌన్ తాజాకబురు : మండల పరిషత్ కార్యాలయంలో శనివారం కరోనా వైరస్ నివారణ, నియంత్రణలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర గురించి,స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత, కరోనా కేసులను గుర్తించడం, రెఫర్ చేయడం, గృహ నిర్బంధంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి యునిసెఫ్ మరియు స్వచ్ఛ్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఎంపీపీ సంధ్యారాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్,యునిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ విజయ, లీడ్ వాలంటీర్ కడకుంట్ల అభయ్ రాజ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here