మొక్కలే తోబుట్టువులుగా మొక్కలకు రాఖీ కట్టిన పైడిమడుగు యువకుడు…

0
166

మొక్కలే తోబుట్టువులుగా మొక్కలకు రాఖీ కట్టిన పైడిమడుగు యువకుడు…

సాదరణంగా రాఖీపౌర్ణమి రోజు సోదరి,సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమ చాటుకుంటారు,సోదరి,సోదరుల మద్య ప్రేమకు చిహ్నంగా మనం రాఖీపండగ నిర్వహించుకుంటాం,కానీ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కొండవేని విజయ్ మాత్రం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పదిహేను మొక్కలకు రాఖీ కట్టాడు,గ్రామానికి చెందిన విజయ్ కి చెట్లు అంటె వల్లమాలిన అభిమానం దాంతో తనకు అక్కచెల్లెళ్లు లేరని చెట్లె తమ సోదరిమనులుగా,రక్తసంభందీకులుగా బావించి గ్రామంలోని భక్తుల మర్రివద్ద పదిహేను చెట్లు నాటి వాటికి రాఖీ కట్టాడు,ఈ రోజు నుండి పదిహేను చెట్ల పూర్తి భాద్యతలు తనవే అంటు వాటిని మొక్కలనండి వృక్షాలవరకు తానే పెంచుతానని చెపుతున్నాడు.మొక్కలను నాటడమె కాదు వాటిని‌ పెంచినప్పుడె నాటిన దానికి విలువ అంటున్నాడు‌ ఈ యువకుడు, ఇలా ప్రకృతిని ప్రేమించి ప్రతి ఒక్కరు తమ‌ బాధ్యతగా చెట్లను రక్షిస్తె రాష్ట్రమంత పచ్చ”దనమె” అవుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here