
రాయికల్ తాజా కబురు : మండలంలోని మైతాపూర్ గ్రామంలోని శ్రీ గిరి పర్వతం పై ఉన్న కనక దుర్గా దేవి ఆలయంలో మంగళవారం భక్తులు 108 రకాల ప్రసాదాలతో అమ్మవారికి అత్యంత ప్రీతి కరమైన పదార్థాలను నైవేధ్యంగా సమర్పించారు. ఈ సంధర్బంగా ఆలయ అర్చకులు మామిడి శ్రీరాం శర్మ మాట్లాడుతూ ప్రసాదం భౌతిక కోణంలో మానవ భక్తునికి, దైవిక శక్తికి మధ్య ఇవ్వడం,స్వీకరించడం అనే ప్రక్రియ ద్వారా ప్రసాదం అనే పదం వచ్చిందని, ఈ శరన్నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ద్వారా భక్తులకు మనశాంతితో పాటుగా కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయాల పరిరక్షణ కమిటి అధ్యక్షులు నర్ర రాజు,ఉపాధ్యక్షులు గంగుల భూమేష్,ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి రాజు,కోశాధికారి అల్లకొండ సుధాకర్,సహాయ కార్యదర్శి మోర్తాటి బాలన్న, సభ్యులు శివనీతి గంగారెడ్డి,మామిడిపెల్లి గంగరాజం,మ్యాకల రాజేశం,కొడిమ్యాల రామకృష్ణ,సుంచుల స్వామి,గడ్డం రమేష్, రాగుల లింగారెడ్డి,గాలి రాజు దేవి దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు