శాకాంబరీ దేవి రూపంలో దుర్గా మాత
రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామ శ్రీ గిరి పర్వతం పై కొలువున్న కనక దుర్గా దేవి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు మామిడి శ్రీ రాం శర్మ భక్తులతో చండీ యాగం, హోమం పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలతో శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు.
దుర్గా దేవి ఆలయం లో చండీ యాగం చేయడం వల్ల ఆపదలు తొలగిపోయి,ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ కార్యక్రమం లో ఆలయాల పరిరక్షణ అధ్యక్షులు నర్ర రాజు, ఉపాధ్యక్షులు గంగుల భూమేష్,ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి రాజు,కోశాధికారి అల్లకొండ సుధాకర్,సహాయ కార్యదర్శి మోర్తాటి బాలన్న,సభ్యులు శివనీతి గంగారెడ్డి,మామిడిపెల్లి గంగరాజం,మ్యాకల రాజేశం,కొడిమ్యాల రామకృష్ణ,సుంచుల స్వామి,గడ్డం రమేష్, రాగుల లింగారెడ్డి,గాలి రాజు దేవి దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.