మేమున్నామని భరోసా ఇచ్చిన దోస్తులు,మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

0
527

మేమున్నామని భరోసా ఇచ్చిన దోస్తులు,మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం…

పైడిమడుగు యువత ఆదర్శం…మరణించిన మిత్రుడి కుటుంబానికి 85000₹ ఆర్థికసాయం..

రోడు ప్రమాదంలో మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి మిత్రుల అర్థిక సాయం…

దోస్తు మేరా దోస్తు తుహేమేరీ జాన్,నేస్తమా ఇద్దరిలోకం ఒక్కటెలేవమ్మ అంటు చెట్టపట్టాలేసుకొని తిరిగె స్నేహితుల గురించి స్నేహితుల దినోత్సవం రోజు కొటేషన్లు,కవిత్వాలు రాస్తారు,కానీ నిజానికి వచ్చెసరికి అది కార్యరూపం దాల్చదు,నిజమైన స్నేహం చివరిశ్వాసరకు తోడుంటుంది,మిత్రుడు సజీవంగా లేకపోయిన ఆ జ్యాపకాల్లో చిరకాలం ఉంటుంది అని నిరూపించారు ఆ మిత్రులు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కల్లెడ రాజుకుమార్ ఈ నెల ఆరు తేది రోజు గ్రామంలో రోడుప్రమాదంలో మృతి చెందాడు, అసలె పేదరికం ఆపై ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు,అప్పటివరకు తమతో ఆడుతూపాడుతూ తిరిగిన తన స్నేహితుడు కానరానీ తీరాలకు వెళ్లటాన్ని ఆ గ్రామ యువత జీర్ణించుకోలేకపోయారు,తమ స్నేహితుడి కుటుంబానికి రాజుకుమార్ తమ్ముడి చదువుకి ఏదైన చెయ్యాలనుకున్నారు,కొన్ని యూత్ లు ముందుకువచ్చి తమతమకు నచ్చినంత డబ్బులు పోగుచేశారు, అలా ఒకరికొకరు తెలుసుకొని యువత ముందుకు వచ్చింది, వాళ్లను చూసిన గ్రామంలో విద్యను బోధిస్తున్న ప్రభుత్వ టీచర్లు తమకు తోచిన సాయం చేశారు, వాళ్లందరిని చూసిన గల్ఫ్ లో ఉంటున్న కార్మికులు రాజుకుమార్ కుటుంబానికి తమవంతుగా డబ్బులను పంపించారు దాంతో మిత్రులు ఆరంభించిన ఈ మహాత్కర్యంలో పలువురు పాలుపంచుకున్నారు,అందరు తల ఇంత వేసి జమచేస్తె అవి 85000₹ ఎనబై ఐదువేలు అయ్యాయి, వాటిని ఈ రోజు రాజుకుమార్ కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

స్నేహాం విందులు వినోదాలకు మాత్రమె కాదు,
స్నేహాం అంటే గొడవలు గ్యాంగ్ లకె కాదు, స్నేహామంటె కడదాక తోడుండేది, స్నేహామంటె కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనేది అని నిరూపించారు ఈ గ్రామ యువకులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here