మెగా పల్లె ప్రకృ తి వనాలను ఏర్పాటు చేయుటకు భూములను గుర్తించాలి- కలెక్టర్ కె.శశాంక

0
23


తాజా కబురు కరీంనగర్ : ఏడవ విడత హరితహారం కార్యక్రమం లో భాగం గా 10 ఎకరాల లో మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పా టు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అంద రూ ఎంపీడీవోలు,మండల పంచా యతీ అధికారులు,మండల స్పెషల్ ఆఫీసర్ ల తో హరితహారం,పల్లె ప్రగతి పనుల పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి లో లేదా ఇతర శాఖలకు సంబంధిం చిన భూములలో మెగా పల్లె ప్రకృ తి వనాలను ఏర్పాటు చేయుటకు భూములను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి మండలంలో ఐదు కిలోమీటర్ల లక్ష్యంగా ప్రధాన రోడ్ల వెంబడి మూడు వరుసలలో పెద్ద పెద్ద మొక్కలు నాటాలని కలె క్టర్ ఆదేశించారు.ప్రతి మండలం లో 15 కిలోమీటర్ల లో పంచాయతీ రాజ్,ఆర్ అండ్ బి రోడ్ల వెంబడి విరివిగా మొక్కలు నాటాలని ఆదే శించారు.మండలాల లోని అన్ని రోడ్ల ప్రక్కన మొక్కలు లేకుండా ఖాళీగా ఉండకుండా మొక్కలు నాటాలని ఆదేశించారు.వర్షాలు కురిసినందున హరితహారం కార్య క్రమంలో మొక్కలు నాటుట కు గుర్తించిన స్థలాలలో గుంతలు తవ్విండం ప్రారంభించాలని ఆదేశిం చారు.అన్ని మండలాలలో 20 రోజుల్లో గుంటలు తవ్వించడం పూర్తిచేయాలని అన్నారు.గుంట లు త్రవ్వించిన 3-4 రోజుల్లో మొక్క లు నటించాలని అన్నారు.జిల్లాలో ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల లో,పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రా లలో,చెరువు గట్ల ప్రక్కన,ఎస్సా రెస్పీ కెనాల్ ల పక్కన,వ్యవసాయ క్షేత్రాల గట్ల ప్రక్కన విరివిగా మొక్క లు నాటాలని ఆదేశించారు.ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి నటించాలని అన్నా రు.హరితహారం కార్యక్రమం విజ యవంతం చేయుటకు మండల స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశిం చారు.మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు హరితహారం కార్యక్రమం లో భాగస్వాములు కావాలని ఆదేశించారు.గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీలలో సరిప డా మొక్కలు లేనిచో వెంటనే ఫారె స్టు నర్సరీల నుండి మొక్కలు తె ప్పించుకోవాలని ఆదేశించారు. అన్ని మండలాలకు జిల్లా సాయి అధికారులతో మండల ప్రత్యేక అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు.మండల ప్రత్యేక అధికారులు ఎంపిడివోలు లతో కలిసి నాలుగు రోజుల్లో అన్ని గ్రామాలను సందర్శించి హరిత హారం ఏర్పాట్లు,పల్లె ప్రగతి పను లు,పారిశుద్ధ్య పనులను తనిఖీ చేయాలని ఆదేశించారు.మండల ప్రత్యేక అధికారుల సందర్శనలో గ్రామాలలో కార్యదర్శులు,సర్పం చుల పనితీరును సమీక్షించాలని తెలిపారు.పల్లె ప్రగతి పనులను వేగవంతంగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా,గ్రామాలలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరిపించాలని అన్నారు.రోడ్లపై నీటిని నిల్వ ఉండకుండా చూడా లని,డ్రైనేజీ లలో పూడిక తీయిం చాలని ఆదేశించారు.గార్బేజ్ నీ వెంట వెంటనే బయటకు తరలిం చాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత,జిల్లా పం చాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ పవన్,మండల ప్రత్యేక అధికారు లు,ఎంపీడీవోలు,మండల పంచా యతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here