ముస్లిం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

0
149

రాయికల్ టౌన్ : పట్టణంలోని 60 నిరుపేద ముస్లిం కుటుంబాలకు కోరుట్ల పట్టణానికి చెందిన నయీం జబ్బార్ రంజాన్ పండగను పురస్కరించుకొని ఎస్సై జున్ను ఆరోగ్యం,మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు చేతుల మీదుగా నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగకు ముందు నిరుపేద ముస్లిం కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తానని, అలాగే ఈ సంవత్సరం కూడా అందజేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గండ్ర రమాదేవి, ,మహ్మద్ నబి ,గండ్ర అచ్యుతరావు, షంషీర్ ,మహిళలు తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here