ముంబాయి ’’గుబులు’’ఈ రోజు జగిత్యాల జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు,33 కు చేరుకున్న పాజిటివ్ ల సంఖ్య

0
1155

ముంబాయి ’’గుబులు’’ఈ రోజు జగిత్యాల జిల్లాలో  10 కరోనా పాజిటివ్ కేసులు,33 కు చేరుకున్న పాజిటివ్ ల సంఖ్య

తాజకబురు బ్యూరో రిపోర్ట్ జగిత్యాల: ముంబాయి నుండి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ కేసులు రోజరోజుకు నమోదు అవుతున్నాయి, ముంబాయ్, మహారాష్ర్ట ,భీవండి నుండి వచ్చిన వారు కొందరు హోం క్వారెంటైన్ లో ఉండగా మరికొందరు గ్రామాల్లోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ లో ఉన్నారు, అయితె వైద్యులు నిత్యం పరీక్షలు చేయటం, లక్షణాలను గుర్తుపట్టడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు తొందరగా గుర్తిస్తున్నారు, అయితె బెంగ వచ్చిందంత హోం క్వారెంటైన్ లో ఉన్న వారు యదెచ్చగా తిరగటం, గ్రామ, పట్టణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత చెప్పిన పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు దాంతో వైద్యులు,నాయకులు ఏం చేసేదిలేకా వదిలిపెడుతున్నారు,దాంతో రోజురోజుకు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి తాజాగా ఈ రోజు 9 మంది వలస కూలీలకు కరోన పాజిటివ్ రాగా, ధర్మపురి మండలానికి చెందినవాళ్లు 5 గురు, కథలాపూర్ మండలానికి చెందిన వారు ఒక్కరు, కొడిమ్యాల మండలానికి చెందిన వారు ఇద్దరు, గొల్లపల్లి మండలానికి చెందినవాళ్లు ఒకరు రాయికల్ కు చెందిన వారు  ఒక్కరుగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, అయితె ఇప్పటివరకు చూసుకుంటె జిల్లా వ్యాప్తంగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ముగ్గురు డిశ్జార్జ్ అయ్యారు, 29 మంది చికిత్స పొందుతున్నారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here