మిల్లర్లు రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించేది లేదు – జగిత్యాల ఎమ్యెల్యే

0
168

మిల్లర్లు రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించేది లేదు – జగిత్యాల ఎమ్యెల్యే

రైతు సమస్యలను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది -ఎమ్యెల్యే

రాయికల్ రూరల్ తాజా కబురు : మండలంలోని మైతాపూర్ గ్రామంలో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురువారం ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కోసం 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఎస్సారెస్పీ నీటి ద్వారా ఒక్క ఎకరం కూడా ఎండ కుండ రైతులకు అన్ని రకాలుగా అండగా ఉన్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం మాత్రమే అని రాష్ట్రంలో వరి,మొక్కజొన్న,జొన్నలు,శనగలు మొదలైన ధాన్యాలు కొనడం ప్రారంభించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.

ఇతర రాష్ట్రాలలో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని, కొందరు ప్రతిపక్ష నాయకులు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని, రైతులు సంయమనం పాటించి వాళ్ల ఉచ్చులో పడకూడదని, ఇప్పటికే 27 వేల కోట్ల నిధులను వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కేటాయించిందని, అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచడం ద్వారా రైతులు ఒక ఊరి వారు ఇంకో ఊరికి వెళ్లకుండా సామాజిక దూరం పాటించాలని, ఊరు కేంద్రాల ద్వారానే కొనుగోలు జరుపుతారని దీనికోసం 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించారని అన్నారు. కోతలు జరిపిన ధాన్యం తేమశాతం వచ్చిన తర్వాత రైస్ మిల్లులకు పంపగా తాలూ తప్ప కారణాలతో రైతులను ఇబ్బంది గురిచేస్తున్నారని రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించేది లేదని ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారితో మాట్లాడానని అలాగే జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపానై రైతులకు తెలిపారు.

అగ్గి తెగులు, మెడ విరుపు రోగాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని కొందరు రైతులు కూడా ధాన్యం లోని తప్పను తీసేసి మిల్లులకు తీసుకెళ్లే విధంగా సహకరించాలని కోరారు.రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని అందరూ తలకు తువాల,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను నీటిలో కలిపి తాగాలని,వడ దెబ్బ తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిఎసిఎస్ చైర్మన్లు మరియు సెంటర్ల ఇన్చార్జిలు రైతులకు ORS ప్యాకెట్స్, నీటి సదుపాయం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ సంధ్య రాణి సురేందర్, PACS ఛైర్మెన్ మల్లారెడ్డి, సర్పంచ్ అజారుద్దీన్, ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ ,ఉప సర్పంచ్ శ్రీనివాస్,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గన్నే రాజారెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ లు నారాయణ, నర్సింహారెడ్డి, రాజారెడ్డి.అధికారులు,రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here