మా గ్రామంలో మద్యం అమ్మవద్దు,అక్రమ బెల్ట్ షాప్ లను మూసివెయ్యాలని పైడిమడుగు యువకులు సర్పంచ్ కు వినతి..

0
562

మా గ్రామంలో మద్యం అమ్మవద్దు,అక్రమ బెల్ట్ షాప్ లను మూసివెయ్యాలని పైడిమడుగు యువకులు సర్పంచ్ కు వినతి..

లాక్ డౌన్ సడలింపుతో మద్యం అమ్మకాలు పెరగటంతో మందుబాబులు రోజు అడ్డు అదుపులేకుండా రెచ్చిపోతున్నారు,గ్రామాల్లోని బెల్ట్ షాప్ ల్లో మద్యం ఏరులై పారుతుంది,దీనితో తమ గ్రామంలో మద్యం అమ్మకాలను నిలిపివెయ్యాలని యువకులు ముందుకువచ్చారు…

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలోని సుమారు ఇరువై యూత్ సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేసుకున్నారు, తమ‌ గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకూడదని ఏకమయ్యారు,గడిచిన సంవత్సర కాలంలో ముగ్గురు యువకులు మద్యం సేవించి‌ రోడు ప్రమాదంలో మృతి చెందారు, లాక్ డౌన్ సడలింపు రోజె రాజుకుమార్ అనె యువకుడు మరణించటంతో పాటుముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి, మరుసటి రోజు బైకు పైనుండి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు,అవన్నీ మద్యం వల్లనె జరిగాయని మద్యపాన నిషేధం గ్రామంలో అమలు చెయ్యాలనె దృక్పథం తో సుమారు రెండు వందలమంది యువకులు ఓ గ్రూప్ గా ఏర్పడి ముందుగా గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న బెల్ట్ షాప్ ల్లో మద్యం అమ్మకాలను నిలిపివెయ్యాలని సర్పంచి దమ్మ భీమరెడ్డికి వినతి‌ పత్రం సమర్పించారు.గ్రామంలో గత‌కొంత కాలంగా గొడువలు, రోడు ప్రమాదాలకు మద్యం కారణమని అందుకె గ్రామంలో మద్యమె లేకుండా చేసెందుకు యూత్ అంత కలిసికట్టుగా ముందుకు వచ్చామని యువకులు చెపుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here