మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు: రాయికల్ ఎస్సై జె. ఆరోగ్యం

0
143

తాజా కబురు జగిత్యాల: మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే వారిపై చర్యలు తప్పవని రాయికల్ పోలీస్ ప్రజలను హెచ్చరించిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు తప్పక మాస్క్ ధరించాలని,కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య ఘణనీయంగా పెరుగుతున్నాయని,కరోనా వ్యాధిని నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా సాధ్యపడుతుందని, ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ లను ధరించి బయటకు రావాలని, ఎవరైన వ్యక్తులు మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లయితే వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షన్లు, 188 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సదరు వ్యక్తులపై తీసుకునే చర్యల్లో భాగంగా జరిమానాలను విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నిబంధనలు ఏప్రిల్ 30వ తేది వరకు అమలులో వుంటాయని,ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందిచాల్సి వుంటుందని, రాయికల్ పట్టణ మరియు మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో నమోదయ్యే కరోనా కేసులపై దృష్టి సారిస్తూ, పోలీస్ పరంగా అప్రమత్తంగా వ్యవహరించడం జరుగుతోందని,ఇందుకు అనుగుణంగా అనుమతులు లేకుండా ఏలాంటి సభలు,సమావేశాలు,నిర్వహించవద్దని,ప్రజలు గుంపులు,గుంపులుగా ఉన్న సమయంలో, వివిధ పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ అంక్షలు వర్తిస్తాయని రాయికల్ ఎస్సై జున్ను ఆరోగ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యపడుతుందని ఆయన ప్రజలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here