మానవ సేవే మాధవ సేవ-మెన్నేని నీలిమ

0
124

రాయికల్ తాజా కబురు: మండలంలోని ఇటిక్యాల గ్రామ శివారు లో గల నివేదిత వృద్ధాశ్రమంలో యునిసెఫ్ సహకారంతో ఏర్పాటైన జగిత్యాల జిల్లా వాలంటీర్స్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఆశ్రమంలోని వృద్ధులకు వారానికి సరిపడా పండ్లు, బిస్కెట్ లు, మాస్కులు, శానిటైజర్ లు, బ్రెడ్ ప్యాకెట్లను సొసైటీ అధ్యక్షురాలు మెన్నేని నీలిమ పంపిణి చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితం పసి ప్రాయంలో ఎలా గడుస్తుందో వృద్ధాప్యం లో కూడా అలాగే గడుస్తుందని ప్రతి ఒక్కరు సమాజ సేవ చేస్తూ, మానవ సేవే మాధవ సేవగా భావించాలని అన్నారు.

అనతంరం కార్యక్రమానికి సహకరించిన దాత జక్కుల లతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు సజ్జనపు రాజమౌళి, ఆశ్రమ నిర్వాహకులు సత్యనారాయణ, సర్పంచ్ సామల్ల లావణ్య-వేణు,కుర్మపల్లి సర్పంచ్ నల్లపు తిరుమల్, ఎంపిటీసీ కొమ్మల ఆదిరెడ్డి గారు, మల్లాపూర్ మండల వ్యవసాయ కమిటీ అధ్యక్షులు దేవ మల్లయ్య,మాజీ జెడ్పీటీసీ తోటే శ్రీనివాస్,లీడ్ వాలంటీర్స్ అభయ్ రాజ్,రుద్ర రామ్ ప్రసాద్, ధర్మరాజు,యునిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ లు విజయ, శ్యామల, నీరజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here