మహిళ పోలీస్ లు నూతన టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉండాలి

0
88


కొత్తగా విధుల్లో చేరిన మహిళ పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల తాజా కబురు: జిల్లాకు కేటాయించిన సివిల్, ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లు 23 మంది మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరిన సిబ్బంది నూతన ఉత్సాహంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నూతన టెక్నాలజీని నేర్చుకునేందుకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఉన్న ఐటీ కోర్ టీమ్ నందు టెక్నాలజీ పై నాలుగు వారాల పాటు ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా ఐటి కోర్ ఇన్స్పెక్టర్స్ సరిలాల్ ను ఆదేశించారు.ఉద్యోగం లో ఎదురయ్యే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.అధికారుల సూచనల ప్రకారం విధులు నిర్వహిస్తూ ఎలాంటి రిమార్కులు లేకుండా సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా మెలగాలని సూచించారు.విధుల పట్ల ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని వాటి పట్ల తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్,ఎఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here