మట్టి డంపు కాలీ అవుతున్న అధికారుల చర్యలు శూన్యం

0
248

రాయికల్ తాజా కబురు: మండలంలోని పెద్ద చెరువు నుండి రైతుల పేరుతో కొందరు ఇటుక బట్టీల వ్యాపారస్తులు మట్టిని తీస్తూ డంపులుగా నిల్వచేసుకున్నారని అట్టి అక్రమ మట్టి డంపులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీజ్ చేయాలనీ, అక్రమ చెరువు తవ్వకాల ద్వారా ఎగువ పంటలు ముంపుకు గురి అవుతాయని, మట్టిని తరలిస్తున్న అక్రమరుకులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 12 జూన్ 2019 నాడు మైతాపూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి రఘుపతి ఒక పిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోగ ప్రస్తుతం అట్టి మట్టి డంపును ఇటుక బట్టీల వ్యాపారస్తులు రవాణా చేసుకుంటున్నారనే విషయాన్ని చరవాణి ద్వారా జిల్లా రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకవెళ్లినట్లు, నిబంధనల ప్రకారం మట్టి డంపులను సీజ్ చేయాలనీ కోరినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here