మట్టి డంపులను సీజ్ చేసేదెప్పుడు… అధికారుల నిర్లక్షమా…. ప్రజా ప్రతినిధుల జోక్యమా…?

0
296

రాయికల్ తాజా కబురు: పట్టణంలోని పెద్ద చెరువు నుండి రైతుల పేరుతో అక్రమంగా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు మట్టిని మైతాపూర్, చెర్లకొండాపూర్ మార్గ మాద్యం లో డంపులుగా నిల్వ చేసుకుంటూ ఇటుక బట్టీల నిర్వహణ కోసమే మట్టిని తరలిస్తున్నారని గత ఏడాది 12 జూన్ 2019 న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైతాపూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి రఘుపతి పిర్యాదు చేసాడు.08 నెలలు గడిచిన ఆయన చేసిన పిర్యాదు పై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 03 ఫిబ్రవరి 2020 నాడు చేసిన పిర్యాదు పై తీసుకున్న చర్యలను గురించి స. హా దరఖాస్తు చేయగా సంబంధిత దరఖాస్తును మండల తహశీల్దార్ కార్యాలయానికి 17 ఫిబ్రవరి 2020 నాడు బదిలీ చేస్తూ ఆయన కోరిన సమాచారంను అందించాలని, తెలిపినప్పటికీ 16 మార్చి 2020 వరకు ఏవిధమైన సమాచారం లేకపోవడంతో మొదటి అప్పీల్ చేసాడు. ఇప్పటికి ఏవిధమైన సమాచారం లేకపోగా ప్రస్తుతం అట్టి మట్టి డంపులను రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా కోరుట్ల లోని ఇటుక బట్టీలకు అక్రమార్కులు తరలిస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు రఘుపతి తెలుపగా విచారిస్తామని,మైనింగ్ శాఖ అధికారులకు సమాచారం తెలుపగా రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తుందని తెలుపుతూ, మా పరిధి కాదని నిర్లక్ష వైఖరిని అవలంభిస్తూ సంబంధిత అక్రమార్కులకు ప్రజా ప్రతినిధుల జోక్యంతో అధికారులు అండగా ఉంటున్నారని,మట్టి డంపులను సంవత్సర కాలంగా సీజ్ చేయకుండా కాలయాపన చేస్తూ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here